Dashavidha naadaala Omkaaramai thotti Song Lyrics
పరిచయం:-
దశవిధ నాదాల ఓంకారమై తొట్టి అనే ఈ పాట సంప్రదాయంగా పాడుకునే ఒక భజన పాట.కాలజ్ఞాన రచయిత శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నామస్మరణతో కూడిన ఈ భజన పాటను చెక్క భజన, హరి భజన, కోలాటం మరియు ఇతర భక్తి సత్సంగాలలో సామూహికంగా పాడబడుతూ ఉంటారు.
సరళమైన పదాలు, మధురమైన లయతో ఈ పాట భక్తుల హృదయాలలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క భక్తిని, ప్రశాంతతని మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది.
Song Information:-
- Song Name: Dashavidha naadaala Omkaaramai thotti Song Lyrics
- Category: Traditional Telugu Folk Song
- Occasion: Bhajana / Festival / Cultural Event
- Language: Telugu
- Region: Andhra Pradesh & Telangana
దశవిధ నాదాల ఓంకారమై తొట్టి – Telugu Lyrics
పల్లవి:
దశవిధ నాదాల ఓంకారమై తొట్టి ప్రారంభమాయెనే ఉయ్యాలో… పరబ్రహ్మ మను జ్యోతి తొట్టిలోపల తాను ఊగుచున్నాడే ఉయ్యాలో… ఆ… హా… ఊగుచున్నాడే ఉయ్యాలో…
చరణం 1:
పంచరంగులు కలిసి సప్త జ్యోతుల తోటి నిర్మాణమాయెనే ఉయ్యాలో…
విశ్వసృష్టిలోన ఉత్కృష్టమైనది కారణంబై ఊగే ఉయ్యాలో… ఆ… ఆ…
కారణంబై ఊగే ఉయ్యాలో…
చరణం 2:
మాయా కుదురులోన విశ్వంబనియెడి సృష్టి శక్తి విస్తీర్ణమే ఉయ్యాలో… హీరణ్యమను మొలక మహర్దై వెలిసెను అహంకారము గుడమాయే ఉయ్యాలో… ఆ… ఆ… అహంకారము గుడమాయే ఉయ్యాలో…
చరణం 3:
ప్రకృతియనే చెట్టు మూడు గుణములు మూడు కొమ్మలై వెలిగేనే ఉయ్యాలో… జ్ఞానేంద్రియంబులు కర్మేంద్రియంబులు విషయంబులనే ఆకులు ఉయ్యాలో… ఆ… ఆ… విషయంబులనే ఆకులు ఉయ్యాలో…
చరణం 4:
సత్యంబనే కొమ్మ జ్ఞానంబనియెడి పూలు కాయలది దేవతలే ఉయ్యాలో… సంకల్ప మాత్రాన సృష్టి కారణమాయే బయలు చెట్టాయెనే ఉయ్యాలో… ఆ… ఆ… బయలు చెట్టాయెనే ఉయ్యాలో…
చరణం 5:
మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనే నాలుగు కోలుగావించిరే ఉయ్యాలో… అష్ట మదములను తొట్టికి ఎనిమిది పట్టెలమరించిరే ఉయ్యాలో… ఆ… ఆ… పట్టెలమరించిరే ఉయ్యాలో…
చరణం 6:
అస్థి చర్మ రోమ ఖండరంబులు నాలుగు లో పట్టెలమర్చిరి ఉయ్యాలో… పంచ ప్రాణములను వాయువు నాడులను కిలకలమరించిరే ఉయ్యాలో… ఆ… ఆ… కిలకలమరించిరే ఉయ్యాలో…
చరణం 7:
ధాతువులన్నీ కలిసి తొట్టికి నాలుగు కొండ్లు గావించిరే ఉయ్యాలో… పంచభూతములను పంచీకరణము చేసి నులక తొట్టి కట్టిరి ఉయ్యాలో… ఆ… ఆ… నులక తొట్టి కట్టిరి ఉయ్యాలో…
చరణం 8:
పరమానందమనే తొట్టిలోపల పట్టు పాన్పు గావించిరే ఉయ్యాలో… సుప్త స్వప్నమనే రెండు మెత్తని మంచి దిండ్లు కావించిరే ఉయ్యాలో… ఆ… ఆ… దిండ్లు కావించిరే ఉయ్యాలో…
చరణం 9:
జీవంబనే నాలుగు గొలుసుల కావించి తొట్టి నిలగట్టిరే ఉయ్యాలో… పరమాత్మ పవళించు పావనం పగు తొట్టి పరిపూర్ణమాయెనే ఉయ్యాలో… ఆ… ఆ… పరిపూర్ణమాయెనే ఉయ్యాలో…
చరణం 10:
షడధారము లోన ఆది దేవతలు కూడి అహో రాత్రంబుల ఉయ్యాలో… అజప మంత్ర జేప అజపానందము వారు తొట్టి వట్టుకొనిరే ఉయ్యాలో… ఆ… ఆ… తొట్టి వట్టుకొనిరే ఉయ్యాలో…
చరణం 11:
ఇరవై ఒక్క వేయి ఆరు వందల సార్లు సోహంబని ఊగేనే ఉయ్యాలో… జ్యోతి వీరబ్రహ్మం తొట్టి లోపల తాను ఊగుచున్నాడే ఉయ్యాలో… ఆ… ఆ… ఊగుచున్నాడే ఉయ్యాలో…
Dashavidha naadaala Omkaaramai thotti Uyyalo – English Lyrics
Chorus:
Dashavidha naadaala Omkaaramai thotti praarambhamaayene uyyaalo… Parabrahma manu jyothi thotti lopala thaanu ooguchunnnade uyyaalo… aa… aa… ooguchunnnade uyyaalo…
Verse 1:
Pancharangulu kalisi saptha jyothula thoti nirmaanamaayene uyyaalo… Vishwasrushtilona uthkrushtamainadi kaaranambai oogey uyyaalo… aa… aa… kaaranambai oogey uyyaalo…
Verse 2:
Maayaa kudurulona vishwambaniyedi srushti shakthi vistheername uyyaalo… Heeranyamanu molaka mahardhai velisenu ahamkaaramu gudamaaye uyyaalo… aa… aa… ahamkaaramu gudamaaye uyyaalo…
Verse 3:
Prakruthiyane chettu moodu gunamulu moodu kommalai veligene uyyaalo… Jnaanendriyambulu karmendriyambulu vishayambulane aakulu uyyaalo… aa… aa… vishayambulane aakulu uyyaalo…
Verse 4:
Sathyambane komma jnaanambaniyedi poolu kaayaladi devathale uyyaalo… Sankalpa maathraana srushti kaaranamaaye bayalu chettaayene uyyaalo… aa… aa… bayalu chettaayene uyyaalo…
Verse 5:
Manassu buddhi chitham ahamkaaram ane naalgu kolugaavinchire uyyaalo… Ashta madhamulanu thottiki enimidi pattelamarinchi re uyyaalo… aa… aa… pattelamarinchi re uyyaalo…
Verse 6:
Asthi charma roma khandharambulu naalgu lo pattelamarchiri uyyaalo… Pancha praanamulanu vaayuvu naadulanu kilakalamarinchire uyyaalo… aa… aa… kilakalamarinchire uyyaalo…
Verse 7:
Dhaathuvulanni kalisi thottiki naalgu kondlu gaavinchire uyyaalo… Pancha bhoothamulanu pancheekaranam chesi nulaka thotti kattiri uyyaalo… aa… aa… nulaka thotti kattiri uyyaalo…
Verse 8:
Paramaanandhamane thottilopala pattu paanpu gaavinchire uyyaalo… Supttha swapnamane rendu metthani manchi dhindlu kaavinchire uyyaalo… aa… aa… dhindlu kaavinchire uyyaalo…
Verse 9:
Jeevambane naalgu golusula kaavinchi thotti nilagattire uyyaalo… Paramaathma pavalinchu paavanam pagu thotti paripoornamaayene uyyaalo… aa… aa… paripoornamaayene uyyaalo…
Verse 10:
Shadadhaaramu lona aadi devathalu koodi aho raathrambula uyyaalo… Ajapa manthra jepa ajapaanandhamu vaaru thotti vattukonire uyyaalo… aa… aa… thotti vattukonire uyyaalo…
Verse 11:
Iravai okka veyi aaru vandhala saarlu soham banee oogeyne uyyaalo… Jyothi veerabrahmam thotti lopala thaanu ooguchunnnade uyyaalo… aa… aa… ooguchunnnade uyyaalo…
ముగింపు:-
చెక్క భజన, కోలాటం, హరి భజన, బతుకమ్మ, బోనాలు వంటి సంప్రదాయ పాటలు మన సంస్కృతికి, సంప్రదాయానికి, జీవన విధానాలకు మరియు ఆచార వ్యవహారాలకు ప్రాణం వంటివి.
ఈ పాట లిరిక్స్‌ను భద్రపరచడం, అందరికి అందించడం అనేది ఒక సాంస్కృతిక సేవగా భావిస్తున్నాం.
ఈ వెబ్‌సైట్ ద్వారా భవిష్యత్ తరాలకు మన సంప్రదాయాలను అందించగలగడం గొప్ప విషయం.
⚠️Disclaimer / Attention:-
- ఈ పాట సంప్రదాయ / జానపద భజనగా భావించబడుతుంది.
- ఈ పాట లిరిక్స్ భక్తి మరియు సాంస్కృతిక పరిరక్షణ ఉద్దేశంతో మాత్రమే అందించబడుతున్నాయి.
- ఎవరైనా ఈ పాట హక్కుదారులు అభ్యంతరం ఉంటే మాకు తెలియజేయండి.
Searching Key Words:-
- Dashavidha naadaala Omkaaramai thotti praarambhamaayene uyyaalo Song Telugu Lyrics Free Download
- దశవిధ నాదాల ఓంకారమై తొట్టి praarambhamaayene uyyaalo Mp3 Naa Song Telugu Lyrics Download
- Dashavidha naadaala Omkaaramai thotti praarambhamaayene uyyaalo Video Song Telugu Lyrics Download
- దశవిధ నాదాల ఓంకారమై తొట్టి praarambhamaayene uyyaalo Song Telugu Lyrics Download Gaana
- Dashavidha naadaala Omkaaramai thotti praarambhamaayene uyyaalo Song Telugu Lyrics
- శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి Dashavidha naadaala Omkaaramai thotti praarambhamaayene uyyaalo Song Download
